“విశాలాక్షివి, సకల జన ప్రియవు నీవు
సకల జగన్మోహిని నాపాలిట దేవతవీవు
చేతులు కాళ్ళతొ తనువును గప్పి
నా కళ్ళకు నీవు అదృశ్యము గావు
నాకోరికింకను మన్నించవు గావు
నీమనమున ఇవ్వుమిసుమంత తావు
భయమును నీవిక వీడుము
పరకాంతనుదెచ్చుట రాక్షస ధర్మము
అది సత్యము నన్నిక నమ్ముము
నా కోరికలెంతగ రేగినను
నీ అనుమతి లేక నిను తాకను
నా హృదయపు పట్టపు రాణివి
నా మనసును దోచిన దానవు
నాపై భయమిక తగదు
బాధతొ కృంగుట మానుము
ఏకవస్ట్రము జపము తపము
నిరాహారము నీకివి తగవు
నా మనవిని వినుము చేతిని అందుము
పూల మాలలు పుప్పొడి గంధము
బంగరు నగలు వేద ఘోషలు
దాసీ గణములు దక్కును నీకు
ఇంతుల నడుమ ముత్యము నీవు
వయసును ఈ విధి వ్యర్ధము చేయకు
పారే నీరు ల జారే వయసిది
నా చేతిని అంది సుఖములు పొందుము
సుభాంగివి నీవు బ్రహ్మ సృశ్టిలో
నీకు సరియగు జోడీ లేదు
అందాల సుగుణాల రాశివి నీవు
బ్రహ్మనైన వశము చేయు సొగసు నీది
నీ అందానికి నేనొక బందీని
మూఢత వీడి నా చేతినందుము
నా భార్యల నడుమ మణివలె వెలుగుము
నా రాజ్యము నందలి సుఖములు పొందుము
నేగెలిచిన రాజ్యము జనకునికిచ్చెద
నాకీ జగతిన దీటును లేరు
సురులును అసురులు రణమున నాతో ఓడినవారే
నామాటను విని నను వివాహమాదుము
ఆభరణభూషితగ నాకిక దర్శనమిమ్ము
సుఖములు నీకై వెదుకు చున్నవి
దుఖమునిక్కడె వదిలి వేయుము
ఫలములు తినుచూ మదిరలొ మునుగుచు
సుఖ సాగరపు అలలలో తేలుము
మనసుకు తృప్తిగ దానములు చేయుము
స్వ్చగ తోచిన పనులను చేయుము
భయముకు ఇక్కడె తర్పణ వదులుము
నువు రావణ పట్టపు రాణివని తెలిసిన
నీ బందుగు లందరు సుఖముగ నుందురు
రాజ్యము పొయి, అదవుల పాలై
నడకన తిరుగుతు నేలపై సోలుతు
వ్రతములు చేస్తు వనముల వెదుకుతు
ఎందకు ఎండెతు వానలొ నానుతు
అడవిలొ రాముడు బ్రతుకుట కల్ల
యోజన విస్తీర్ణ సాగరము ఆవల
నీ దర్శనమికపై అతనికి కల్గదు
నాకట్టడి మాటున దాచిన నిన్ను
ఏ ఒక్కడు కూడ కనుగొన లేడు
గరుడుదు నాగుల దోచిన విధముగు
నా మనమును నీవే గ్రహించినావు
సుందర మూర్తివి విశాల నేత్రివి
జీర్ణ వస్ట్రమిక వదలగ వలెను
నా మనసుకు ఊరట కలుగుటలేదు
లోకములెల్ల బాగుగ తిరిగి
నిశిత రీతిగ ఎంపిక చేసి
అవసర విధిగా సిక్షణ నిచ్చిన
అప్సర కన్యలు దేవత రీతిగి
సేవలు నీకు తధ్యము నిత్తురు
సుఖముల తోడుగ నన్నును అందుము
తపమున, బలమున,
ధనమున, కీర్తిన,
యశమున, జగమున
రాముడు నాకు సరి రాడు
తినుము త్రాగుము
ఆడుము పాడుము
ఇచ్చపు రీతిగ నాతో చేరుము
వంశ కీర్తిని నలుదిశ పెంచుము"
అనుచు రావణుడు భయముతొ వణుకుతు
రక్కసి మూకల నడుమన ఉన్న
సీతను చూచుచు గర్జించెను. 36
Tuesday, April 22, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment